![]()
-ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న
-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య
ములుగు, మన భద్రాద్రి న్యూస్, మే 18
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా కాంగ్రెస్ పార్టీ
జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాబోయే పట్టభద్రుల వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల పక్షాన, నిరుద్యోగుల కోసం నిలబడి కొట్లాడిన మల్లన్నను పట్టభద్రులు సీరియల్ నెంబర్ 2 కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన పది యేండ్ల నుండి ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యలపై తన గొంతును వినిపించిన తీన్మార్ మల్లన్నను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.


