![]()
-మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 16
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని గురువారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని దాస్ తండా గ్రామంలో ఇల్లందు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేలా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాలలో, పట్ణణాలలో ఉన్న పట్టభద్రులను కలిసి అవగాహన కల్పించాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మే 27 న జరుగు పోలింగులో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్రావు, మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, కంభంపాటి రేణుక, తాతా గణేష్, శీలం రమేష్, పరుసు వెంకటేశ్వరు, ఎంపీటీసీలు శీలంశెటి రమేష్, దాస్యం ప్రమోద్, జాలది అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


