![]()
- పవన్ కు పోటీగా ఆ నేతను ప్రోత్సహిస్తున్న బాబు..
ఏపీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ప్రదేశ్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. జనసేన, తెలుగు దేశం పార్టీలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే వ్యూహాలకు పదును పెడుతున్నారా అంటే ఔననే అంటున్నాయి అక్కడ పరిస్థితులు చూస్తుంటే.. అందుకే ఇపుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాపై ఫోకస్ పెట్టారు. అంతేకాదు పవన్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మతోనే పవన్ కు చెక్ పెట్టాలనే యోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎస్వీఎస్‌ఎన్ వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి.. ఏడాది దాటిన తనకు పదవి రాలేదన్న ఆవేదన ఆయనలో పెరిగిపోతోంది. ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించినా ఆయన చివరకు ఆ పదవి కూడా దక్కకపోవడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ఇండైరెక్ట్ గా వర్మను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
తాజాగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ సహా పలు నామినేటెడ్ పోస్టులు ను భర్తీ చేసినా.. ఎక్కడా వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు. అయితే వర్మకు పదవి దక్కకపోవడం వెనుక కొందరు జనసేన నేతలు ఉన్నారనే టాక్ ఉంది. పవన్ కళ్యాణ్ కారణంగానే వర్మకు ఏ పదవి దక్కడం లేదని ప్రచారం.. ఒకనొక దశలో తనకు ఏ పోస్టు దక్కకపోవడంతో.. వర్మ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ సైతం వినిపించింది. కానీ ఇప్పుడు వర్మకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయినట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్వీఎస్‌ఎన్ వర్మ తన సీటును త్యాగం చేశారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీకి దిగడంతో.. పవన్‌ను గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత వర్మకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగినా.. సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు వర్మకు మంచి పదవి దక్కబోతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పిఠాపురం వర్మను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ భేటీలో మంత్రి నారాయణ కూడా ఉన్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ కోసం తాను గెలవగలిగిన సీటును త్యాగం చేసినందుకు ఉపశమనంగా ఆయనకు మంచి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వారు సంకేతాలు ఇచ్చారు. తర్వాత సీఎం చంద్రబాబున దగ్గరకు కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్తా డీలా పడింది. వర్మకు ఏ పదవి దక్కకపోవడంతో సొంత పార్టీ నేతలు సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే విషయమై వర్మ పార్టీ అధినేత చంద్రబాబుకు ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. త్వరలోనే పదవి ఇవ్వడానికి బాబు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వర్మ ఆశిస్తున్నట్టుగా ఆయనకు గతంలో మాట ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీ పదవినే కట్టబెడతారా? లేదా, మరో ప్రత్యామ్నయ పదవిని ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్, వర్మను నెత్తిన పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత పూర్తిగా పక్కన పడేశారు. పైగా ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం కూడా ఉంది. కానీ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు వర్మకు కీలక పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద త్వరలోనే వర్మకు కీలక పదవి దక్కబోతుందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే పిఠాపురంలో మరో పవర్ సెంటర్‌గా వర్మ మారితే.. జనసేన అధినేతకు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు.. మరి ఈ విషయంలో జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే పిఠాపురంలో ఇద్దరు, ముగ్గురు జనసేన నేతలు ఉన్నారు. వారి మధ్య ఇప్పుడు వర్మ రాజకీయాలు ఎలా చక్కబెడుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదీ ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడిన యేడాది తర్వాత.. వర్మకు ఏ పదవి దక్కబోతుందనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.


