![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊర మాస్ జాతర షురూ అయింది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా (OG Movie)… నిన్న అర్ధరాత్రి రిలీజ్ అయింది.
సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో.. సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ జపం చేస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు… పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా గురించి పోస్టులు కనిపిస్తున్నాయి.
అయితే… సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో… ఇందులో నటించిన నటీనటులకు ఎంత రెమ్యూనరేషన్ దక్కింది అనే అంశం కూడా చర్చనీయాంశమైంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన కెరియర్ లోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఏకంగా 80 కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో దర్శకుడు సుజిత్ కు 8 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి కి ఐదు కోట్లు దక్కగా…. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ రెండు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.


