Monday, March 23, 2026
HomeAndhra Pradeshపసుపు కోల్డ్ స్టోరేజ్‌లో భారీ అగ్నిప్రమాదం

పసుపు కోల్డ్ స్టోరేజ్‌లో భారీ అగ్నిప్రమాదం

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్ :

గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుగ్గిరాలలో శుభం మహేరి కోల్డ్ స్టోరేజ్ మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా పొగలు దట్టంగా అలముకున్నాయి.

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రస్తుతం మంటలు ఇంకా అదుపులోకి రాలేదని తెలుస్తోంది. ఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లు తీసుకొచ్చి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే మంటలు అంతకంతకూ ఎగిసిపడుతున్నాయని తెలుస్తోంది. స్టోరేజ్‌కు నాలుగు వైపులా మంటలు అంటుకోవడంతో విజయవాడ నుంచి మరో ఫైరింజన్ పలిపించి మంటలార్పుతున్నారు. రాత్రి సమయంలో కావడంతో మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో కొన్ని వేల బస్తాల పసుపు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page