![]()
జమ్మూకశ్మీర్ పై పాకిస్థాన్ ఆర్మీ డ్రోన్స్, మిస్సైల్స్‌తో దాడులకు పాల్పడింది. కొన్ని డ్రోన్స్‌ను భారత డిఫెన్స్ సమర్దవంతంగా అడ్డుకుంది.కానీ జమ్మూకశ్మీర్‌తో పాటూ కొన్నిచోట్ల పేలుళ్లు సంభవించాయి. పాక్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. పాక్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ ను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. మొత్తం మూడు ఫైటర్ జెట్లను భారత ఆర్మీ కూల్చివేసింది. అంతే కాకుండా పది పాకిస్థాన్ డ్రోన్లను సైతం పేల్చివేసింది.


