![]()
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్
పట్టణంలోని జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం పాఠశాలలో విధులకు హాజరైన ఆయన ఛాతి నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకులాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు రమేష్ ను వెంటనే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. అప్పటికే ఉపాధ్యాయుడు రమేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు తమతో ఉన్న రమేష్ టీచర్ మరణ వార్త విని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉపాధ్యాయుడి మృతితో పాఠశాల మొత్తం విషాద ఛాయాలు అలుముకున్నాయి.


