Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపిడుగుపాటుకు గురై బాలుడు మృతి

పిడుగుపాటుకు గురై బాలుడు మృతి

Loading

-ఇద్దరికి తీవ్రగాయాలు

ఆళ్ళపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూన్ 05

మండల పరిధిలోని రాఘవపురం గ్రామపంచాయతీ సీతానగరం గ్రామంలో పిడుగుపాటుకు గురై బాలుడు మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం సీతానగరం గ్రామానికి చెందిన మేకల విజయ్, సావిత్రి దంపతుల చిన్న కుమారుడు సంపత్ (14), అదే గ్రామానికి చెందిన గొగ్గెల శివకుమార్, శివకుమార్ లతో కలిసి గ్రామ శివారులోని మామిడి చెట్టు కింద ఆడుకుంటున్న సమయంలో మామిడి చెట్టు మీద పిడుగు పడడంతో ముగ్గురు చిన్నారులు స్పృహ కోల్పోయారు. మరొక బాలుడు రంజీత్ కాలకృత్యానికి వెళ్ళి తిరిగి వచ్చి, స్పృహ కోల్పోయిన మిత్రులను చూసి గ్రామస్థులకు సమాచారం అందించాడు. వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అప్పటికే బాలుడు సంతోష్ మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. మిగతా ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page