![]()
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 19

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదగా ప్యాడ్స్, పెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.ఎస్.ఆర్ యూత్ నాయకులు బాదం మణికంఠ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంకొండ వాసు, కాటం వెంకట రామిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


