![]()
-జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, స్టేషన్ రైటర్స్, కంప్యూటర్ ఆపరేటర్లతో శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేస్తూ ఉండాలని సూచించారు. ఏవైనా సందేహాలు తలెత్తితే డీసీఆర్బీ అధికారులకు తెలియజేసి, వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కేసు నమోదు అయినప్పటి నుండి పరిష్కారం అయ్యే వరకు ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పొందుపరిచాలని టెక్ టీం ఆపరేటర్లకు సూచించారు. ఆన్లైన్లో పొందుపరిచే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఐటీ సెల్ సహకారం తీసుకోవాలని అన్నారు. నేరస్థులకు శిక్ష పడే విధంగా కృషి చేసి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామీ, సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, భద్రాచలం సీఐ సంజీవరావు, దుమ్ముగూడెం సీఐ అశోక్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, 1 టౌన్ సీఐ కరుణాకర్, 3 టౌన్ సీఐ శివప్రసాద్, ఇల్లందు సీఐ సత్యనారాయణ, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


