![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే17
మండలంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం బ్రహ్మం గారి ఆలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు, భక్తులు, మహిళలు, చిన్నారులు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


