![]()
-ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 18
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల తరపున ప్రశ్నించే గొంతుకగా గత పది సంవత్సరాలుగా నిలబడిన తీన్మార్ మల్లన్న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్న మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోరం సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య దేవనాయక్, ఎంపీపీ భూక్య రాధ, భూక్య సైదులు నాయక్, ఇస్లావత్ రెడ్యానాయక్, బోడ సరిత, రవీందర్ సింగ్, ఊకె రామకృష్ణ, ఉండేటి ప్రసాద్, బండ్ల శ్రీనివాస్, చంద్ర కళ, ధర్మ, గణేష్, మూడ్ సంజయ్, తదితరులు పాల్గొన్నారు.


