Monday, March 23, 2026
HomeTelangana Newsప్రజాపాలన గ్రామసభకు హాజరైన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

ప్రజాపాలన గ్రామసభకు హాజరైన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Loading

ప్రజాపాలన గ్రామసభకు హాజరైన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్

ఈరోజు అంజనాపురం గ్రామ పంచాయతీలో  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకారణ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజలందరు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు ఎవ్వరూ మీసేవ సెంటర్ల దగ్గరకు వెళ్లి దరఖాస్తుల కోసం ఇబ్బంది పడొద్దని, ప్రతి దరఖాస్తును గ్రామ సభల్లోనే అధికారులకు ఇవ్వాలని చెప్పారు. దరఖాస్తు ఫారం పూర్తి చేయటంలో ఏమైనా సందేహాలు ఉంటే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అడిగి తెలుసుకొని తగిన వివరాలతో దరఖాస్తు పూర్తి చేసి అధికారులకు అందజేయమని సూచించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వారితో పాటు బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, స్థానిక ప్రజలు సర్పంచ్ భూక్యా భారతి, ఎంపిడి వివేక్ రామ్, గ్రామ కమిటి అధ్యక్షులు శ్యామ్, వార్డు మెంబర్ బికారి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముని, ఖరీమ్, తేజవత్ శంకర్, జున్ను, మండల అధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page