Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemప్రజా నాయకులు నర్రా రమేష్ కు విప్లవ జోహార్లు

ప్రజా నాయకులు నర్రా రమేష్ కు విప్లవ జోహార్లు

Loading

ప్రజా నాయకులు నర్రా రమేష్ కు విప్లవ జోహార్లు అర్పించిన సీపీఎం పార్టీ మండల కమిటీ.

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్ సెప్టెంబర్ 06

సీపీఎం సీనియర్ నేత ప్రజా పక్షపాతి నర్రా రమేష్ కి స్థానిక ఇల్లందు మండల కేంద్రం ఏలూరి భవన్ లో మన్యం మోహన్ రావు, అబ్దుల్ నబి, ఆలేటి కిరణ్ కుమార్ లు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కేంద్రం లో పార్టీ అభివృద్ధికి , పేద బడుగు బలహీనతల వర్గాల ప్రజలకు అండగా నిలబడి పోరాడిన నేత నర్రా రమేష్ అని అన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మండల సమావేశం లో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ బీ జే రాజు, గడ్డం వెంకన్న ,సంతోష, పల్లి సుజాత,కోటమ్మ, నీల రాణి, జ్యోతి ,ఎస్తేరు,హుస్సేని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page