![]()
- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
- మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
పినపాక, మన భద్రాద్రి న్యూస్
మండల స్థాయి అధికారులు నిత్యం గ్రామాలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలంలోని పినపాక, సీతంపేట, బోటిగూడెం గ్రామ పంచాయతీలలో సుమారు ఐదు గంటల పాటు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి గ్రామాలలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత పినపాక మండలంలోని మారేడుగూడెం గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పాలచెరువు, వసంతరావు కుంట వరద నీరు గ్రామంలోకి రావడంతో తమ ఇళ్ళు ముంపునకు గురి అవుతున్నాయని తెలపడంతో వరద నీరు గ్రామంలోకి రాకుండా కాలువకు ఇరువైపులా కట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


