Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి లేఖాస్త్రం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి లేఖాస్త్రం

Loading

బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, పోలవరం ముంపునకు గురవుతున్న భద్రాచలం ప్రాంతానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి లేఖాస్త్రం


భద్రాచలం మన భద్రాద్రి న్యూస్ జూలై 24

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, పోలవరం ముంపునకు గురవుతున్న భద్రాచలం ప్రాంతానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమని భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితీ అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి విమర్శించారు. విభజన తరువాత భద్రాచలం ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని, పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో భద్రాచలం ప్రాంతంలోని ఏడు మండలాలను ముంచడానికి ఆంధ్రాలో కలిపారనీ, 7 మండలాలనూ తేలంగాణాలోనే కొనసాగించాలని ఉద్యమం చేసినప్పటికీ భద్రాచలం పట్టణంతో పాటుగా బూర్గంపహాడ్ రెవెన్యూ గ్రామాన్నీ మాత్రమే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తెలంగాణాలో కలపడం జరిగిందని డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు.

ఆనాటి నిజాం ప్రభుత్వంలోని పాల్వంచ పరగణా తహశీల్దార్ కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసు గారిచే నిర్మించబడిన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవాలయాన్ని కంచర్ల గోపన్న అలియాస్ భక్తరామదాసు గారు నిర్మించారని చూపించిన చారిత్రక ఆధారాలు చూపించి, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి మరియు మీడియా, స్థానిక ప్రజలు, అనేక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం వలన, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపహాడ్ రెవెన్యూ గ్రామాన్ని కూడా తిరిగి తెలంగాణాలో కలపడం జరిగిందనీ, పోలవరం ప్రాజెక్ట్ ముంపునకు గురవుతున్న ఈ ప్రాంతాన్ని అప్పటి నుండి నేటి వరకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాలు చిన్నచూపు చూడటమే కాకుండా భద్రాద్రి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యంగా విస్మరించారనీ, భద్రాచలం ప్రాంత అభివృద్ధి కోసం ముంపునకు గురవుతున్న ప్రజానీకాన్ని ముంపునకు గురికాకుండా ఆదుకోవడం కోసం, భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపహాడ్ మండలం వైపునకు కూడా గోదావరికి ఇరువైపులా కూడా కరకట్టలు నిర్మించమని, బూర్గంపహాడ్ మండలంలో కూడా ప్రాజెక్టు వలన ముంపునకు గురౌతున్న బూర్గంపహాడ్, నాగినేనిప్రోలు, సారపాక, తాళ్ళ గొమ్మోరు, మోతె, ఇరవెండి, రామచంద్రాపురం తదితర గ్రామాలలో ముంపునకు గురవుతున్న భూములకు, ఇండ్లకు నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం గానీ, రాష్ట్రంలో పదేళ్ళు కొనసాగిన బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ పట్టించుకున్న దాఖలాలు లేవనీ, అంతే కాకుండా శ్రీరామాలయ అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తామని, భద్రాద్రి ప్రాంతంలోని గోదావరి ముంపుకు గురౌతున్న నిర్వాసితులందరికీ శాశ్వత ప్రాతిపదికన గృహ నిర్మాణాలు చేపడతామని, విభజన వలన నష్టపోయిన భద్రాద్రి ప్రాంతాన్ని వెయ్యి కోట్లతో బ్రహ్మండంగా అభివృద్ధి చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న మాజీ సీఎం కేసిఆర్ కల్లబొల్లి మాటలు గోదావరి వరదల్లో కొట్టుకు పోయాయని డా బూసిరెడ్డి శంకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు

కావున ఇప్పటికైనా భద్రాద్రి ప్రాంతాన్ని కొత్తగూడెం భద్రాచలం రోడ్ నుంచి సారపాక వరకు రైల్వే లైన్, అదే విధంగా భద్రాచలం మీదుగా ఒరిస్సా, లేదా నర్సీపట్నం మీదుగా విశాఖపట్నంకు రైల్వే లైన్ ఏర్పాటు చేసి దేశానికి అనుసంధానం చేయాల్సిందిగా మరియు పోలవరం బ్యాక్ వాటర్ వలన ముంపునకు గురవుతున్న భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపహాడ్ మండలం వైపున కూడా కరకట్టలను నిర్మించాలని, పోలవరం ముంపునకు గురవుతున్న పొలాలను, ఇండ్లను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పకడ్బందీగా అమలు చేయాలని, భద్రాచలం నుండి పాపి కొండల వరకు టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని తద్వారా గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి సౌకర్యాలు మెరుగు పడతాయని విజ్ఞప్తి చేశారు

శ్రీరామచంద్రుని పేరుపై రథయాత్ర నిర్వహించి జై శ్రీరామ్ అంటూ అధికారంలోకి వచ్చి, శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న, శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంత అభివృద్ధిని విస్మరించడం భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి తగదని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్టు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలిచ్చి, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆఖరకు శ్రీరామచంద్రుని కళ్యాణంలో అపచారం జరుగుతున్నా, కళ్యాణంలో శ్రీరామచంద్ర నామాన్ని శ్రీరామనారాయణ గా మార్చి అపసృతులు జరుగుతున్నాని విన్నవించినా పట్టించుకోని కేసిఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుందనీ డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి దుయ్యబట్టారు.

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వంగా పేర్కొంటున్న, తెలంగాణ రాష్ట్రంలో కొలువై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించి పైన పేర్కొన్న విషయాలనన్నింటిని పరిగణలోకి తీసుకుని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయవలసిందిగా భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితీ అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి ముఖ్యమంత్రి శ్రీఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page