Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్, వాటర్ ట్యాంక్ పంపిణీ చేసిన స్ట్రీట్ కాస్ విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్, వాటర్ ట్యాంక్ పంపిణీ చేసిన స్ట్రీట్ కాస్ విద్యార్థులు

Loading

ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్, వాటర్ ట్యాంక్ పంపిణీ చేసిన స్ట్రీట్ కాస్ విద్యార్థులు

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ హైదరాబాద్,( సిఎంఆర్ సెట్ ) స్ట్రీట్ కాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆదివారం సులానగర్ ప్రభుత్వ హైస్కూల్లో స్కూల్ ఫర్నిచర్ మరియు వాటర్ ట్యాంక్ ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, గత నెలలో పాఠశాలను సందర్శించినప్పుడు, స్వచ్ఛమైన మంచినీరు, స్కూల్ కి ఫర్నిచర్, మరుగుదొడ్లలో సరైన వాటర్ సౌకర్యం లేదని, అలాగే లైబ్రరీలో సరేనా పుస్తకములు,బ్లాక్ బోర్డ్స్ లేవని గుర్తించామని స్ట్రీట్ కాస్ సంస్థ ద్వారా, ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి పాకెట్ మనీతో తమ సొంత కార్యక్రమాలు కాకుండా. స్ట్రీట్ కాస్ అనే వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నమని వారు గుర్తు చేశారు గత 11 సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో, బాలికల కొరకు మరుగుదొడ్ల నిర్మాణం, పుస్తకాలు, వీధిలైట్లు, మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు, ఈ కార్యక్రమాలకు మా సంస్థ ద్వారా గత సంవత్సరం ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసామని స్ట్రీట్ కాస్ సంస్థ ద్వారా 15 రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా సులానగర్ మాజీ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య, చరణ్ లు పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు యువత తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో తమ సొంత ఖర్చులకు కాకుండా సమాజ అభివృద్ధిలో ఉపయోగిస్తున్నందుకు వారు సొసైటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో
టేకులపల్లి ఎంఈఓ జగన్,
డివిసనల్ ప్రెసిడెంట్ పూర్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్ బల్లెం కీర్తనమాల, ట్రెజరర్ నికిత, జయంత్,వి. కెన్సీ, రాజి, ధీరాజ్, సింధు, దీక్షిత్ ఆకాష్, సేవా హృదయ్ ఆర్గనైజర్, బల్లెం చిట్టిబాబు, బల్లెం కరుణ శ్రీ, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, దామళ్ల రాజయ్య, రమణయ్య,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page