Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemప్రభుత్వ స్థలాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టండి

ప్రభుత్వ స్థలాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టండి

Loading

ప్రభుత్వ స్థలాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టండి

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్

చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో ప్రభుత్వ స్థలంలో షెడ్ల నిర్మాణం జరుగుతుందన్న తెలుసుకొని రెవెన్యూ శాఖ స్థలం దగ్గరకు వెళ్ళగా దళిత నిరుపేదలo మా పిల్లల నివాసాలు ఏర్పాటుకు ఈ స్థలమే ఆధారం తాతల కాలం నాటి నుంచి ఈ భూమి మా స్వాధీనంలోనే ఉంది మా ప్రాణాలైనా అర్పిస్తాం ఈ భూమిని మాత్రం వదలం అంటూ అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన పలు దళిత కుటుంబాలు అంటున్నాయి. అయ్యన్నపాలెం శివారుల్లో ఒక ఎకరమన్నర భూమి అదే గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు బొప్పి కాసులతోపాటు మరికొన్ని కుటుంబాలు దశాబ్దాల క్రితం నుండే వారి స్వాధీనంలో ఉంచుకున్నారు.

అయితే అది ప్రభుత్వ భూమి కావడంతో ప్రజా అవసరాలు ,కళాశాల నిర్మాణం కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక రెవిన్యూ యంత్రాంగం బుధవారం ఆ స్థలాన్ని పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రెవిన్యూ సిబ్బంది కూల్చివేస్తుండగా ఒక మహిళ రెవిన్యూ సిబ్బంది కాళ్లు పట్టుకొని షెడ్డును కూల్చవద్దని వేడుకుంది . ఉన్నత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని అధికారులు వెనుతిరిగారు దీనిపై తాసిల్దార్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వ భూమి కావడంతో కళాశాల నిర్మాణం కోసం ఈ భూమిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. స్వచ్ఛందంగా భూమిని వదిలివేయాలని ఆమె కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page