![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 22
మండల పరిధిలోని యాపలగడ్డ మండల ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా పనిచేసి, నాగారం పాఠశాలకు బదిలీపై వెళ్తున్న ఎస్ రామతులసి ని మంగళవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు పీ కమల, జే హైమావతి లు ఘనంగా సన్మానించారు. యాపలగడ్డ ఎంపీపీఎస్ లో ఎనిమిది సంవత్సరాలుగా విద్యా బోధనలు చేసి, చిన్నారులకు జ్ఞానాన్ని అందించిన ఆమె సేవలను సహ ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


