Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబాలికల ఆశ్రమ గిరిజన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జారే

బాలికల ఆశ్రమ గిరిజన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జారే

Loading

అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్

పట్టణంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలను (బాలికలు) నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించి, విద్యార్థినులతో కలసి ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం అందించాల్సిన విద్యా వసతులను సక్రమంగా అందిస్తున్నారా, మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కాకుండా, ప్రతిరోజు మెనూ సక్రమంగా పాటించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టల్ నిర్వాహణలో ఏ విధమైన అలసత్వం వహించకుండా ఈ పాఠశాలే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు, సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page