![]()
ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు..బెయిల్ ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు..ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే పోసానికి బెయిల్ వచ్చినా సీఐడీ పీటీ వారెంట్ తో జైలులోనే అరెస్ట్ చేసిన కోర్టు.. నెల రోజులుగా నటుడు పోసాని కృష్ణ మురళి నరసారావు జైల్లో రిమాండులో ఉన్నాడు. దీంతో తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు..
గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆయన్ను మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సీఐడీ పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.2 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్ ఫర్ ప్రొహిబిషన్/ఎక్సైజ్ కోర్డులో హాజరుపరిచారు. అక్కడ్నుంచి పోసానిని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో బుధవారం కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం తిరిగి విచారించిన కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది. తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. శుక్రవారం గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది.
అయితే నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు గత నెల 27న అరెస్టు చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్ మెంట్ లోని ఉంటున్న పోసానిని.. బుధవారం రాత్రి ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు.


