![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: బిహార్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోధీ నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో రైల్ కనెక్టివిటీని ఈ రైళ్లు మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు.
ఈ రైళ్లు మొత్తం నాలుగు మార్గాల్లో సేవలందించనున్నాయి. అవేంటంటే.. రాజేంద్ర నగర్ టర్మినల్ (పట్నా) నుంచి న్యూఢిల్లీ, బాపుధామ్ మోతిహరి నుంచి ఢిల్లీ (ఆనంద్ విహార్ టర్మినల్), దర్భంగా నుంచి లక్నో (గోమతీ నగర్), మాల్దా టౌన్ నుంచి లక్నో (గోమతీ నగర్). ఈ మార్గాల్లో కొత్త అమృత్ భారత్ రైళ్లు సేవలందిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. దీంతో బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభించే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య ఐదుకు చేరింది. అలాగే దేశంలో అత్యధిక అమృత్ భారత్ రైళ్లు మొదలయ్యే రాష్ట్రంగా బిహార్ నిలిచింది.


