Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇలా వెళ్ళండి

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇలా వెళ్ళండి

Loading

-ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం

-సభకు ఐదు జోన్లు.. ఐదు మార్గాలు.. ఐదు పార్కింగ్లు

-మూడు జాతీయ రహదారులకు అందుబాటుతో సభాస్థలి

-పార్కింగ్ చేసిన దగ్గర నుండి 200-300 మీటర్ల నడకతోనే సభ ప్రాంగణంలోకి వెళ్ళేటట్టు ఏర్పాట్లు

ఖమ్మం/కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో, ఏప్రిల్ 26

బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభకు నేడు వరంగల్ లోని ఎల్కతుర్తి సమీపంలో రజతోత్సవ సభకి ఏర్పాట్లు సర్వసిద్ధం చేశారు. ఈ రజతోత్సవ సభకు సంబంధించి మూడు జాతీయ రహదారులకు అందుబాటుతో సభాస్థలిని ఏర్పాటు చేశారు. సభకు ఐదు జోన్లు.. ఐదు మార్గాలు.. ఐదు పార్కింగ్ లతో పార్కింగ్ చేసిన దగ్గర నుండి 200-300 మీటర్ల నడకతోనే సభ ప్రాంగణంలోకి వెళ్ళేటట్టు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు ప్రణాళికలను సిద్ధం చేశారు.

రూట్ మ్యాప్ ఇలా..

జోన్ 1 – వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు

జోన్ 1 రూట్ – మల్లంపల్లి నుండి వంగపహాడ్ దాటి NH 163లో U టర్న్ తీసుకుని హసన్‌పర్తి మీదుగా సభ పార్కింగ్

జోన్ 2 – పాత నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గాలు &
ఇల్లందు( కొంత భాగం), వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర

జోన్ 2 రూట్ – ఖమ్మం వారి కోసం మామునూరు నుండి NH 163 టోల్‌గేట్ దాటి అనంతసాగర్ మీదుగా సభ పార్కింగ్

ఉమ్మడి జిల్లాల వారికి కరుణాపురం నుండి NH 163 టోల్‌గేట్ దాటి సభ పార్కింగ్

జోన్ 3 – జనగాం, స్టేషన్ ఘనపూర్

జోన్ 3 రూట్ – ధర్మసాగర్ నుండి సభ పార్కింగ్

జోన్ 4 – పాత కరీంనగర్ జిల్లా నియోజకవర్గాలు, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పరకాల(కొంత భాగం)

జోన్ 4 రూట్ – కరీంనగర్, హుజూరాబాద్ నుండి గ్రానైట్ రోడ్డు మీదుగా పార్కింగ్

జోన్ 5 – పాత మెదక్, నిజామాబాద్ జిల్లాల నియోజకవర్గాలు, నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోత్

జోన్ 5 రూట్ – సిద్దిపేట మీదుగా ముల్కనూర్ నుండి ఇందిరానగర్ పార్కింగ్..

కార్యకర్తలు నాయకులు అభిమానులు ఈ రోడ్డు ద్వారా సభస్థలికి చేరుకోవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page