![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా మరల ఎన్నికైన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని హతిరాం నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండే ఏబీవీపీలో పని చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఆయన చేసిన పనితనాన్ని గుర్తించి మరలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వారి అధ్యక్షతన పార్టీ బలోపేతం అవుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వారి ఆధ్వర్యంలో 50% కంటే ఎక్కువ స్థానాన్ని గెలుచుకుంటామని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధరావత్ బాలాజీ నాయక్, జరుపుల రామచంద్రనాయక్, మండల ప్రధాన కార్యదర్శి బాధావత్ సురేష్ నాయక్, ఈ శంభు, నవీన్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


