Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemబీటీపీఎస్ వలన గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు

బీటీపీఎస్ వలన గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు

Loading

-కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందా లింగయ్య దొర

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, ఆగస్టు 10

భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో గిరిజనులకు తీవ్రమైన నష్టం జరిగిందని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందా లింగయ్య దొర అన్నారు. ఆదివారం డివి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తా ఉన్న గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. మాజీ శాసనసభ్యులు కుంజా బిక్షంకు సుమారు ఐదు ఎకరాలు పట్టా భూమి ఉన్నా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు ప్యాకేజీ కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక మాజీ ప్రజా ప్రతినిధికే న్యాయం జరగలేదంటే సామాన్య గిరిజనుల పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమవుతుందన్నారు 2,163 ఎకరాల గిరిజనుల పట్టా భూములు తీసుకున్నారని అన్నారు నష్టపరిహారం 400 కోట్లు కేటాయిస్తే గిరిజనులకు 50 కోట్లు ఇచ్చారని తెలిపారు 450 మంది బి టి పి ఎస్ లో ఉద్యోగాలు ఇస్తే అందులో 75 మందికి గిరిజనులకు ఇచ్చారని తెలిపారు. బినామీల పేరుతో 375 ఉద్యోగాలను గిరిజనేతరులకు అవకాశాలు కల్పించారని తెలిపారు 2014లో బి టి పి ఎస్ శంకుస్థాపన సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ హామీలకు కట్టుబడి గిరిజనులు భూములను బి టి పి ఎస్ నిర్మాణానికి ఇచ్చారన్నారు భూమికి భూమి, స్పెషల్ ప్యాకేజీ ఇల్లు నిర్మించి ఇస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పది సంవత్సరాలపాటు కుటుంబానికి ప్రతినెల 2000 జీవన భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అవేమి అమలు జరగలేదన్నారు ఆదివాసి గిరిజన జె ఏ సి ఆధ్వర్యంలో బి టి పి ఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంలో భాగంగా ఈనెల 12 భద్రాద్రి పవర్ ప్లాంట్ ముందు కొమరం భీం విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అతిథులుగా హాజరవుతున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో చిడెం నాగేశ్వరరావు కొమరం రామ్మూర్తి మడి నాగ శంకర్ వజ్జా నరసింహారావు కుంజా వెంకటరమణ రామకృష్ణ ఆదిలక్ష్మి మరియు బీటీపీఎస్ భూనిర్వాస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page