![]()
బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ
చండ్రుగొండ, మన భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం గానుగుపాడు నుండి అన్నారం వెళ్ళు దారిలో తండా మధ్యలో ఆర్ అండ్ బి రోడ్డుపై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరైనాయి. బ్రిడ్జి నిర్మాణం చేయుటకు ఈ రోజున చంద్రుగొండ ఎంపీపీ బానోత్ పార్వతి భూమి పూజ చేసి పనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు చెవుల చందర్రావు, ఎంపీటీసీ భూక్య రాజి, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


