Monday, March 23, 2026
HomeNational Newsభర్తతో శృంగారానికి నిరాకరించినా విడాకులు ఇవ్వొచ్చు: బాంబే హైకోర్టు

భర్తతో శృంగారానికి నిరాకరించినా విడాకులు ఇవ్వొచ్చు: బాంబే హైకోర్టు

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: విడాకుల అంశానికి సంబంధించి బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అనుమానించడం క్రూరత్వంతో సమానమని స్పష్టం చేసింది.

విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను ఈ సందర్భంగా తోసిపుచ్చింది.విడాకులకు అనుమతిస్తూ ఫ్యామిలి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకు నెలకు రూ.లక్ష భరణం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ రేవతి మోహితే డెరే, జస్టిస్‌ నీలా గోఖలేల ధర్మాసనం విచారించింది. తోటి ఉద్యోగులు, అతడి స్నేహితుల ముందు ఆమె ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగురాలైన భర్త సోదరి, ఆయన కుటుంబీకుల పట్ల ఉదాసీనత చూపించడం కూడా అతడి బాధకు కారణాలుగా అభిప్రాయపడింది.

2013లో వివాహం చేసుకున్న ఆ జంట.. ఆ ఏడాది తర్వాతి నుంచి విడివిడిగా ఉంటోంది. శృంగారానికి నిరాకరించడంతోపాటు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తోందని.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు ఇబ్బంది పెడుతూ మానసిక వేదనకు గురి చేస్తోందని భర్త ఆరోపించాడు. పుట్టింటికి వెళ్లిపోయినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని వాపోయాడు.

ఇలా భార్య ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురవుతున్నానని, విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2015లో పుణెలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతించింది. దీనిని సవాలు చేస్తూ ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురయ్యింది. అయితే, అత్తమామలు మాత్రమే తనను వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని, విడిపోవాలని కోరుకోవడం లేదని భార్య పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page