Monday, March 23, 2026
HomeInternationalభారత డిప్లొమాట్లపై కక్ష సాధింపు.. నీళ్లు, ఆహారం దక్కనివ్వని పాక్..!

భారత డిప్లొమాట్లపై కక్ష సాధింపు.. నీళ్లు, ఆహారం దక్కనివ్వని పాక్..!

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత దౌత్య అధికారులపై పాకిస్తాన్ పగబట్టింది. వారి ఇళ్లకు, కార్యాలయాలకు కనీస అవసరాలు రాకుండా అడ్డుకుంటోంది.

అధికారిక వర్గాల సమాచారం మేరకు ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్, అలాగే భారత డిప్లొమాట్ల ఇళ్లకు న్యూస్ పేపర్ ఆపేశారట. ఈ విషయం తెలియడంతో భారత్ కూడా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ డిప్లొమాట్ల ఇళ్లకు వార్తాపత్రికలు ఆపేసినట్లు సమాచారం.

అంతేకాదు, ఇటీవలి కాలంలో భారత అధికారులపై పాకిస్తాన్‌లో నిఘా పెంచినట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా భారత డిప్లొమాట్ల ఇళ్లు, ఆఫీసుల్లోకి పాక్ అధికారులు వెళ్తున్నారట. ఇది అంతర్జాతీయంగా ఆచరించే ‘వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్’ నిబంధనలకు పూర్తి విరుద్ధం. కేవలం భారత అధికారులను భయపెట్టేందుకు, వారిపై ఒత్తిడి తెచ్చేందుకు పాక్ ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక్కడితో ఆగకుండా భారత అదికారులకు ఆహార పదార్థాలు, గ్యాస్ వంటివి కూడా అందకుండా పాక్ అడ్డుకుంటోంది. గతంలో భారత అధికారులు వీటిని అందించిన వ్యాపారుల వద్దకు పాక్ అధికారులు వెళ్లి.. ఈ వస్తువుల సరఫరా ఆపివేయాలని బెదిరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో అంటే 2019లో సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పుడు కూడా పాక్ ఇలాగే ప్రతిస్పందించి భారత అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌ చేసినందుకు కక్ష సాధిస్తోందని భారత వర్గాలు భావిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page