![]()
భారీ వర్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
-మాజీ ఎమ్మెల్యే
బానోత్ హరిప్రియ విజ్ఞప్తి
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదివారం మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలిపారు. దాసుతండా వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని, ముఖ్యంగా తడిచిన చేతులతో కరెంట్ స్విచ్ బోర్డులను, కరెంట్ స్తంభాలను తాకవద్దని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలకు వర్షాభావంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు బయటికి పోవద్దని విజ్ఞప్తి చేశారు.
చిన్నపిల్లలను చెరువులు, కుంటలు, కాలువలు, వాగుల వైపు పోనివ్వకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్త వహించాలని తెలిపారు. పొంగి పొరలుతున్న వాగులను చూడటానికి, బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని, సెల్ఫీల పేరిట ప్రమాదం కొని తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా ఆమె తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామ నాయక్, కిషన్ నాయక్, రవికుమార్, వాసు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


