Monday, March 23, 2026
HomeTelangana Newsభూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషకరం

భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషకరం

Loading

భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషకరం

  • ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారు
  • జిల్లా హాస్పటల్ సమీక్ష మరియు డాక్టర్స్ క్యాంటీన్ ప్రారంభం
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధి పై సమీక్ష సమావేశం
  • రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

జయశంకర్ భూపాలపల్లి, మన భద్రాద్రి బ్యూరో, ఆగస్టు 03

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నేతృత్వం లో మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మారుమూల ప్రాంతాలలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చెయ్యడం శుభసూచకం అని మంత్రి సీతక్క అన్నారు. భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రా రావడం సంతోషకరమని అన్నారు. ఇండస్ట్రీస్ వలన భూపాలపల్లి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ములుగు లో కూడా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామని, స్థల సేకరణ చేస్తున్నామని అన్నారు. గతంలో కొందరు నాయకులు ఉద్యోగం కోసం మీ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పది సంవత్సరాలుగా ఒక్క నోటిఫికేన్ ఇవ్వలేదని,
ధరణి తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారని,
రేవంత్ రెడ్డి భూమాతను తెచ్చి విజయవంతంగా ఎర్పాటు చేస్తున్నారని అన్నారు. జాబ్ క్యాలెండర్ తీసుకుని వచ్చామని, స్కిల్ ఇండియా ద్వార యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఆనాటి కాంగ్రస్ ప్రభుత్వం హయం లో రుణ మాఫీ జరిగింది. మరలా ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓకే సారి రెండులక్షల ఋణ మాఫీ చేశామాబి అన్నారు.
భూపాలపల్లి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని, వెనుక బడ్డ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రస్ ప్రభుత్వం ధ్యేయం అని మంత్రి సీతక్క అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page