![]()
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్ (LRS)కి ఆశించిన స్పందన ఉందని.. అయితే గడువు పొడిగించాలనే ఆలోచన ఇప్పటివరకూ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం డబ్బులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ తగిన పరిశీలన అనంతరం ప్రొసీడింగ్స్ ఇస్తామన్నారు. గతంలో 10 శాతం రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలో.. మిగిలిన 90 శాతం ప్లాట్స్‌కు కూడా ఇప్పుడు ఎల్‌ఆర్ఎస్ చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీ ఆవరణలో పొంగులేటి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని పొంగులేటి వెల్లడించారు. రెవెన్యూ సర్వే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. దాదాపు వెయ్యిమంది సర్వేయర్లను నియమిస్తామని చెప్పారు. స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆధార్‌తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. అయితే, గతంలో అన్‌లైన్‌లో నమోదు చేసుకున్న 12 లక్షల సాదాబైనామీలను మాత్రమే భూభారతి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామన్నారు.

రాష్ట్రంలో త్వరలో.. భూ ధరలు (land prices) పెంచబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ను నియమిస్తామని చెప్పారు. అలాగే లైసెన్డ్ సర్వేయర్‌లకు అవకాశం ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా.. 6 వేల మంది లైసెన్డ్ సర్వేయర్‌లకు అవకాశం ఇస్తామని, వీరికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ LRS స్కీమ్ మార్చి 31 వరకు గడువు ఉందని, ఆ లోగా చేసిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ LRS ఇప్పుడు కాకుండా ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలన్నప్పుడు 100 శాతం ఎల్ఆర్ఎస్ LRS కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అర్బన్ ఏరియాలో 1 లక్షా 13 వేల ఇళ్ల మంజూరుఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన – గడువు పొడిగింపుపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొంగులేటి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) పై ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని, అయితే గడువు పొడిగించే యోచన ప్రస్తుతం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఇప్పటికే ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారని, డబ్బులు చెల్లించిన ప్రతి ఒక్కరికీ పూర్తిగా పరిశీలన అనంతరం ప్రొసీడింగ్స్ జారీ చేస్తామని తెలిపారు. గతంలో 10% రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలో, మిగిలిన 90% ప్లాట్లు కూడా ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన పొంగులేటి, ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై ప్రభుత్వం స్పష్టమైన విధానం పాటిస్తుందని, దీనివల్ల భూసేకరణ, భూ వినియోగం మరింత పారదర్శకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
భూభారతితో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి..
రాష్ట్రంలో భూసంబంధిత వ్యవహారాలను మరింత పారదర్శకంగా మార్చేందుకు భూభారతి వ్యవస్థ అమల్లోకి రానుందని, దీని ద్వారా భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. భూభారతి అమలుతో పౌరుల భూ సంబంధిత సమస్యలను తక్కువ సమయంలో పరిష్కరించేందుకు వీలవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రెవెన్యూ సర్వే లేని భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దీనికి అనుగుణంగా 1,000 మంది కొత్త సర్వేయర్లను నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ నియామకం, 6,000 లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం – ప్రత్యేక శిక్షణ, స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టి ఆధార్ అనుసంధానం, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన 12 లక్షల సాదాబైనామాలను భూభారతి అమలైన తర్వాత పరిష్కారం చేస్తారు. రాష్ట్రంలో భూధరలు పెరగనున్నాయని, భూభారతి అమలయ్యాక భూముల రిజిస్ట్రేషన్‌కు మరింత ఖచ్చితమైన విధానం తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

ఎల్‌ఆర్‌ఎస్ గడువు మార్చి 31 వరకు – ఇప్పుడే చేస్తే 25% డిస్కౌంట్
ఎల్‌ఆర్‌ఎస్ (LRS) గడువు మార్చి 31 వరకు మాత్రమే ఉందని, ఆ లోగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే 25% రాయితీ లభిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఇప్పుడే చేయించుకుంటే తక్కువ చార్జీలు ఉంటాయి. తర్వాత ఇల్లు నిర్మించే సమయంలో అనుమతి తీసుకునే సమయంలో 100% పూర్తి చెల్లించాల్సి వస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ను అనుసరించకపోతే భవిష్యత్తులో నిర్మాణాల అనుమతుల విషయంలో సమస్యలు తలెత్తుతాయని, ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద అర్బన్ ఏరియాల్లో 1,13,000 గృహాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం ₹1.50 లక్షలు మాత్రమే మంజూరు చేస్తుంది. మిగిలిన మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇంకా కేంద్రం నుంచి స్పష్టత రాలేదు.
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని, ఈ స్కీమ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాదాబైనామాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని, ఇప్పుడే కొత్త దరఖాస్తులు స్వీకరించే యోచన లేదని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసిన 13 లక్షల పాత దరఖాస్తులను రిజెక్ట్ చేసిందని గత ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. రిజెక్ట్ అయిన వారందరూ అప్పీల్ అథారిటీకి వెళ్ళి తమ ఫైళ్లను మళ్లీ పరిశీలించుకోవచ్చని సూచించారు. భూభారతి అమలైన తర్వాత భూసంబంధిత లావాదేవీల్లో మరింత పారదర్శకత రాబోతుందని, ఈ సమస్యలన్నింటికీ ప్రభుత్వ కొత్త విధానాలతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై స్పందన – రాజకీయ విభేదాలు లేవన్న మంత్రి
తనకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని, ఎవరితోనూ రాజకీయంగా సమస్యలు లేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. “ఎమ్మెల్యే అనిరుద్ చెబుతున్న అభిమన్యు రెడ్డి ఎవరో నాకు తెలియదు. రాజకీయాల్లో విభేదాలు సహజమే. కానీ, మేము అందరం కలిసి పని చేస్తాం. రాష్ట్రాభివృద్ధి కోసం ఏకతాటిపై నడవడమే మా లక్ష్యం” అని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్రం ప్రధాని ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్షా 13 వేల ఇళ్లను మంజూరు చేశారని తెలిపారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం 1.50 లక్షలు మాత్రమే కేంద్రం ఇస్తుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. రూరల్ ఏరియాకు సంబంధించి కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. అలాగే సాదాబైనామాల విషయంలో కొత్త దరఖాస్తులు స్వీకరించమని స్పష్టం చేశారు. 13 లక్షల పాత దరఖాస్తులను గత ప్రభుత్వం రిజక్ట్ చేసిందని ఆరోపించారు. రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అధారిటిలో ఆపిల్ చేసుకోవచ్చని వెల్లడించారు. నాకు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మధ్య ఎలాంటి సమస్య లేదు.. నాకు ఏ ఎమ్మెల్యేతో సమస్య లేదు.. అని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుద్ చెబుతున్న అభిమన్యు రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు.. అని మంత్రి స్పష్టం చేశారు.


