Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemభూ భారతి నూతన రెవిన్యూ చట్టం అవగాహన సదస్సు

భూ భారతి నూతన రెవిన్యూ చట్టం అవగాహన సదస్సు

Loading

భూ భారతి నూతన రెవిన్యూ చట్టం అవగాహన సదస్సు

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలులో ఉన్న ధరణి వ్యవస్థ వల్ల అనేక రకాల అన్యాయాలు భూ సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నారు అని భూముల రిజిస్ట్రేషన్లు హక్కుల నిర్ధారణ రికార్డుల నిర్వహణ వంటి కీలక అంశాల్లో స్పష్టత లేకపోవడంతో రైతులు భూస్వాములు ఇబ్బందులకు గురయ్యారు అని ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత భూ భారతి అనే కొత్త పారదర్శకమైన ప్రజల మేలు కాంక్షించే చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం పైలట్ ప్రాజెక్టులుగా కొన్ని మండలాల్లో విజయవంతంగా అమలై ప్రజల మద్దతు పొందింది అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3వ తేది నుంచి 20వ తేది వరకు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు చండ్రుగొండ మండలంలోని గానుగపాడు, దామరచర్ల గ్రామ పంచాయతీలలో సదస్సు నిర్వహించారు. సదస్సులలో రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రజలకు కొత్త చట్టం ప్రయోజనాలు విధి విధానాలు వివరించారు. గత చట్టం వల్ల నష్టపోయిన వారు అన్యాయానికి గురైన వారు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో పంచాయతీ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులకు ఇవ్వవచ్చు అని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు తెలిపారు. గానుగుపాడు గ్రామ పంచాయతీలలో మొత్తం 253 దరఖాస్తులు వచ్చాయని, దామరచర్ల గ్రామ పంచాయతీలలో 220 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల తహసిల్దార్ సంధ్యారాణి, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page