Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమండలంలో ఎమ్మెల్యే పాయం విస్తృత పర్యటన

మండలంలో ఎమ్మెల్యే పాయం విస్తృత పర్యటన

Loading

మండలంలో ఎమ్మెల్యే పాయం విస్తృత పర్యటన పర్యటన

పలు నూతన జంటలను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పాయం

గుండాల, మన భద్రాద్రి న్యూస్

మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వేంకటేశ్వర్లు శనివారం పలు శుభాకార్యాలలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును గుండాల పోలీస్ స్టేషన్ ముందున్న చెక్ పోస్ట్ వద్ద పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పోలీస్ అధికారులు తనిఖీ నిర్వహించారు. తనిఖీ అధికారులకు పాయం సహకరించారు. అనంతరం ఆయన గుండాలలోని సాబీర్ – నైమా దంపతుల ద్వితీయ కుమారుడైన ఇస్రార్ – జాస్మీన్ జంటను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందించి, శుభాకాంక్షలు తెలిపి, దడిగల శ్రీను – మంగ దంపతుల కుమారుడు తరుణ్ – శ్రావణిల వివాహం కొద్ది రోజుల క్రితం జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు.

మండల పరిధిలోని కొడవటంచ గ్రామంలో ఈసం సంజీవరావు – శ్యామల కుమారుడు కృష్ణమూర్తి – అనితలకు కొద్ది రోజుల క్రితం వివాహం జరగగా వివాహానికి రాలేని కారణం చేత వారి ఇంటి వద్దకు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page