![]()
-చిన్న చినుకు పడితే చాలు వెంటనే కరెంట్ కట్
-రోజులో కనీసం 5, 6 సార్లు కరెంటు కట్ చేస్తున్నారని మహిళల ఆవేదన
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
చండ్రుగొండ మండలంలో ప్రజలు కరెంటు కోతల వలన ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు వస్తాయన్న గత ప్రభుత్వం మాటలను ఈరోజు మండలంలోని విద్యుత్ అధికారులు మాత్రం నిజం చేస్తూ కరెంటుని రోజుకి ఐదు, ఆరు సార్లు కోత విధిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చినుకు పడితే చాలు కరెంట్ కట్ అనే భావనను ప్రజల్లోకి తీసుకువచ్చే విధంగా చేస్తున్నారని, రాత్రివేళలో మాత్రం చినుకు పడిందంటే కరెంటు రాదన్న భావనను ప్రజలకు కల్పిస్తున్నారని, ఉదయం పనికి వెళ్లిన మహిళలు సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తే, ప్రతి పది నిమిషాలకు ఒకసారి కరెంటు పోవడం వల్ల అప్పటి వరకు వ్యవసాయం పనిలో కష్టపడి ఇంటికి వచ్చి త్వరగా పని ముగించుకుందాం అనుకుంటే, కరెంటు వల్ల పని ఆలస్యమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కరెంటు కోతల వల్ల మండలంలోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కరెంటు కోతలు లేకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని కోరుతున్నారు.
కరెంటు కోతలపై విద్యుత్ శాఖ ఏఈ వివరణ
ఈ విషయంపై విద్యుత్ అధికారిని (ఏఈ) వివరణ కోరగా ఎండాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రైతులకు ఇచ్చే విద్యుత్ ని నిలిపివేశామని, ఇప్పుడు రైతులకు విద్యుత్ అవసరం కనుక వాటిని మరమ్మత్తులు చేస్తున్నామని, ఒరిగిన స్తంభాలను కూడా మరమ్మత్తులు చేస్తున్నామని, రెండు, మూడు రోజుల్లో 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.


