Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమండలంలో మావోలకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

మండలంలో మావోలకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

Loading

మండలంలో మావోలకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 28

మండలంలోని దామరతోగు, చిన్న వెంకటాపురం, సాయనపల్లి, ఘణాపురం పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా శుక్రవారం పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టుల హింసాకాండ అంటూ చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు పాల్పడుతున్న వరుస హింసాత్మక ఘటనలో జూన్ రెండవ తారీఖున చుత్వాయ గ్రామానికి చెందిన మద్వి నందా (22) అనే ఆదివాసీ యువకుడు మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి తీవ్రంగా గాయపడి, తన రెండు కాళ్లు కోల్పోయాడని, మావోయిస్టు అరాచకాలకు బలి అవుతున్న అమాయక ఆదివాసీలు అంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారని, మావోయిస్టుల క్రూరత్వం వల్ల ఏప్రిల్ 20 న పటేల్ పారా ముత్తండి గ్రామం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 18 ఏళ్ల వయసున్న గడియ అనే ఆదివాసీ యువకుడు అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని, మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ పేలి అక్కడికక్కడే మృతి చెందాడని, దళిత ఇల్లందుల ఏసు మృతికి కారణమైన మావోయిస్టుల చర్యను ఖండిద్దాం, మావోయిస్టులు ఆగడాలను ముక్తకంఠంతో ప్రశ్నిద్దాం అంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు పోస్టల్ రూపంలో వెలిశాయి. ప్రజలారా మేల్కొనండి ఇకనైనా మావోయిస్టును తరిమికొడదాం అంటూ ఆదివాసీ సంఘాలు ముందుకొచ్చాయని, మావోయిస్టులు అమర్చినటువంటి బాంబుల వల్ల అమాయక ఆదివాసీలు బలవుతున్నారని, ఆ అమాయక ఆదివాసీలను మావోయిస్టులు పొట్టన పెట్టుకుంటున్నారంటూ ఈ పోస్టర్లలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page