![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మార్చి 29
మండల కేంద్రంలో ప్రతీ మంగళవారం నిర్వహించే వారంతపు సంత 2024 – 2025 సంవత్సరానికి 30.03.2024 శనివారం నాడు వేలం పాట నిర్వహించనున్నారు. మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో గుండాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ వేలం పాట శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు గుండాల గ్రామపంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ సింగ్ ఠాగూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాటలో ఆసక్తిగలవారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాగా ప్రతీ మంగళవారం నిర్వహించే సంతకు మండల పరిధిలోని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి తమకు వారానికి కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తారు.


