![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూలై 24
మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు, బ్రెడ్ లను పంపిణీ చేశారు. కేటిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మున్ముందు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకలలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, మండల యువజన అధ్యక్షులు సయ్యద్ అజ్జు, ఎస్టీ సెల్ నాయకులు పొంబోయిన సుధాకర్, మండల అధికార ప్రతినిధి తిరుకవల్లూరి రాము, గడ్డం వీరన్న, గంగాధరి ప్రమోద్, సనప రవి, బొమ్మెర్ల పద్మారావు, బొమ్మెర్ల సతీష్, మోకాళ్ళ అనీల్, కుంజా సుధాకర్, వాగబోయిన బాటయ్య, బొమ్మెర్ల శ్రీకాంత్, రామటెంకి అనీల్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు మోకాళ్ళ పవన్ కళ్యాణ్ దొర తదితరులు పాల్గొన్నారు.


