![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 17
మండల కేంద్రంలో బతుకమ్మ ఘాట్ వద్ద శుక్రవారం మండలంలోని విశ్వబ్రాహ్మణులు (పంచ వృత్తులు) తమ కుల దైవమైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు విశ్వకర్మ జెండాను ఎగురవేసి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు మాజోజు చంద్రాచారి మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఎంతో అద్భుతమైన శక్తి కలిగిన వారని, స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తన దివ్య దృష్టితో ముందుగానే చూసి కాలజ్ఞానం ద్వారా తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలిశాల రవి, వెలిశాల రమేష్, మాజోజు నర్సింహా చారి, కొనపర్తి దుర్గా చారి, కందుకూరి హనుమా చారి, వెలిశాల శ్రీను, కొనపర్తి వెంకటేశ్వర్లు, దోనోజు వెంకటాచారి, వెలిశాల నరేష్, మాజోజు వెంకటేష్, వెలిశాల కిరణ్, వెలిశాల రాకేష్, కోడూరి పాపా చారి, వెలిశాల సత్యం, దోనోజు శశిధర్, మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.


