![]()
- పినపాక ఎమ్మెల్యే పాయానికి వినతిపత్రం అందజేసిన సిపిఐ నాయకులు
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జులై 03
మణుగూరు మున్సిపాలిటీ రద్దు చేసి గ్రామ పంచాయతీలుగా మార్చాలని కోరుతూ మంగళవారం నాడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్న లక్ష్మీ కుమారి, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ప్రజలు, గ్రామీణ కూలీలు నివాసం ఉంటున్నారు. 2005 వ సంవత్సరంలో గ్రామ పంచాయతీని రద్దుచేసి, మణుగూరు మున్సిపాలిటీగా చేశారు. నాటి నుండి పాలకమండలి లేకపోవడం వలన మొత్తం మున్సిపల్ అధికారులే పెత్తనం చేస్తున్నారు. కానీ గ్రామాల్లో అభివృద్ధి అభివృద్ధి లేదు. ఇంటి పన్నులు అధిక మొత్తం తీసుకుంటున్నారు. అభివృద్ధి మాత్రం శూన్యం. గ్రామాల్లో ఎక్కువగా పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు జీవనం సాగిస్తున్నారు అని పాయం వెంకటేశ్వర్లుకు తెలియజేశారు.


