Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమన్యంలో విరిసిన విద్యా కుసుమం

మన్యంలో విరిసిన విద్యా కుసుమం

Loading

-ఆయుర్వేదిక్ డాక్టర్ బత్తిని భార్గవికి పట్టా పురస్కారం

-బీఏఎంఎస్ వైద్యురాలిగా భార్గవి

గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 09

నేటి పోటీ ప్రపంచంలో యువతీ, యువకులు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఆశయం, పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది మండల కేంద్రానికి చెందిన బత్తిని సారంగపాణి(ఆంధ్రప్రభ విలేఖరి) – శోభా దంపతుల కుమార్తె బత్తిని భార్గవి. అనంతపురం జిల్లా గుంతకల్ సాస ఆయుర్వేదిక్ కాలేజీలో విద్యను పూర్తిచేసిన క్రమంలో ఆమె కృషి ఫలితంగా ఆదివారం అరుదైన ఆయుర్వేదిక్ డాక్టర్ పట్టా పురస్కారం లభించడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు. భార్గవి నర్సంపేట సిద్ధార్థ పాఠశాల్లో మెట్రిక్ లేషన్ చదివి, త్రివేణి కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన అనంతరం మెడికల్ నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం గుంతకల్ మెడికల్ ఆయుర్వేదిక్ కాలేజీల్లో ఐదున్నర సంవత్సరాలుగా కఠోర సాధనతో చదువును పూర్తి చేసింది. బత్తిని భార్గవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని గుంతకల్ మెడికల్ ఆయుర్వేదిక్ కాలేజీలో బీఏఎంఎస్ డాక్టర్ పట్టా పురష్కారం కాలేజీ చైర్మన్, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆయుర్వేదిక్ డాక్టర్ పట్టాను అందుకోవడం సంతోషకరమని ఆమె తండ్రి బత్తిని సారంగపాణి తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ కూతురు భార్గవికి బాల్యదశ నుండే విద్య పట్ల ఎంతో మక్కువ ఉండేదని, పట్టు వదలని కృషి, ఆశయం ఆమె ముందు పటాపంచలు చేసి, ఐదున్నర ఏళ్ల కఠినమైన విద్యను పూర్తిచేసి ఆయుర్వేదిక్ బీఏఎంఎస్ డాక్టర్ పట్టా పురస్కారం దక్కడం మాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కన్న బిడ్డలు కళ్ళ ముందు తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టి ఉన్నత స్థానాలను అధిరోహించడంతో తల్లిదండ్రులకు అవధులు లేని ఆనందం కలుగుతుందని, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచి భార్గవికి పట్టా పురస్కారం లభించడంతో గుండాల మండలానికే గర్వంగా ఉందని అన్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్ బత్తిని భార్గవి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నా విద్య ఎంతో ముందుకు సాగిందని, వారి కృషి ఫలితంగా పట్టుదలతో బీఏఎంఎస్ విద్యా కోర్సును పూర్తిచేసి, గుండాల మండలానికి, మా కుటుంబ సభ్యులకు పేరు ప్రఖ్యాత లభించేలా ఎంతో శ్రమించడం జరిగిందని ఆనందభాష్పాలతో ఉద్వేగపూరితంగా తమ అనుభవాలను పంచుకున్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్ బత్తిని భార్గవి వైద్య సేవలు ప్రజలకు ఎనలేనివిగా అందించేందుకు ఆమెకు లభించిన పట్టా పురస్కారమే నిలువెత్తు నిదర్శనమని మండలంలోని అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page