Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudem" మన భద్రాద్రి న్యూస్ " కథనానికి స్పందించిన మండల ఎంపీడీవో

” మన భద్రాద్రి న్యూస్ ” కథనానికి స్పందించిన మండల ఎంపీడీవో

Loading

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్

మండలంలోని రావికంపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో బుధవారం ” మన భద్రాద్రి న్యూస్ “ ప్రచురించిన ” అప్పు తెచ్చి వంటలు వండలేము “ అనే వార్తా కథనానికి మండల ఎంపీడీవో స్పందించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం నుంచి గత కొన్ని నెలలుగా విడుదల కానీ నిధులు, భోజన ఖర్చుల పెట్టుబడికి గ్రామస్థులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఊర్లో ఉన్న గ్రామ పెద్దలతో కలిసి, మండల ఎంపీడీవో అశోక్ చర్చించి బుధవారం పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అశోక్ మాట్లాడుతూ ఇక నుంచి ఎవరూ ఇబ్బంది పడవద్దని, ప్రతి నెల నిధులను విడుదల చేసేలా ప్రభుత్వానికి తెలుపుతామని, పిల్లలకి కడుపునిండా భోజనం పెట్టి రుచికరమైన కూరలతో మెనూ ప్రకారం వడ్డించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు తెలిపారు. గ్రామస్థులందరూ సహకరించినందుకు అందరూ కలిసి మన బడిని మనం మంచిగా చూసుకోవాలన్న తాపాత్రయం చూసి ఎంపీడీవో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గ్రామస్థులు మన భద్రాద్రి న్యూస్ వార్తా పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, రావికంపాడు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page