![]()
అచ్చంపేట, మన భద్రాద్రి వెబ్ డెస్క్, మార్చి 05
ఎస్ఎల్బీసీ సంఘటనపై రెస్క్యూ ఆపరేషన్లు మరింత వేగంగా పని చేస్తూ ముందుకు వెళుతున్నాయని, పన్నెండవ రోజు నాటికి సొరంగంలో లోకల్ ట్రైన్ 13.5 కిలోమీటర్లకు వెళ్లి అక్కడ పేరుకుపోయిన మట్టి ఇతర వ్యర్థాలను బయటికి తీసుకొస్తుందని, రెస్క్యూ ఆపరేషన్ మరో 72 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బుధవారం ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను ఎమ్మెల్యే పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెస్క్యూ ఆపరేషన్ ఎంత వేగంగా పూర్తి చేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే వాటన్నిటిని కూడా అమలు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారని, అదే క్రమంలో ఆ రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతుందన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాక్ హోల్ మైనర్స్ ఇతర అన్ని రకాల రెస్క్యూ సంస్థలు చేపడుతున్న కృషి అమోఘమన్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు ఎనిమిది వేల టన్నుల మట్టిని లోకల్ ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పూర్తిగా అండగా ఉంటామని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని అందజేస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.


