![]()
మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన సదస్సు
ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్
ఆళ్లపల్లి ఎస్సై రతీష్ ఆదేశాల మేరకు రాఘవాపురం గ్రామంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఎస్సై వెంకట్ రెడ్డి అవగాహన సదస్సులో మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించడం ద్వారా మానసిక విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారని వారు తెలియజేశారు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం వల్ల మహిళలు లైంగిక వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, వరకట్నపు వేధింపులు, బలవంతపు వ్యభిచారం మరియు మరెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, అలాగే పిల్లల విషయానికొస్తే చిన్న వయస్సులోనే శారీరిక, లైంగిక, మానసిక వేధింపులకు గురి చేయడం ద్వారా వారు చనిపోవడం జరుగుతుందని, అలా చేస్తే పొక్సో చట్టం ద్వారా నిందితుడిని కఠిన జైలు శిక్ష విధించబడుతుందని వారు తెలియజేశారు.
అదేవిధంగా వాహనాలు నడపడం గురించి తెలిసినంతగా ట్రాఫిక్ రూల్స్ గురించి చాలామందికి తెలియదని, ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే మనకు, ఇతరులకు నష్టం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని వారు తెలియజేశారు. ఇప్పుడు ఉన్న చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, అవి అమలులోకి వచ్చాయని వారు తెలిపారు. సైబర్ క్రైమ్, ర్యాగింగ్ మరియు ఆత్మహత్యలను గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాఘవాపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


