Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమాపై చిన్న చూపు చూస్తే ఫలితాలు మారొచ్చు

మాపై చిన్న చూపు చూస్తే ఫలితాలు మారొచ్చు

Loading

మాపై చిన్న చూపు చూస్తే ఫలితాలు మారొచ్చు

  • సిపిఐ మండల కార్యదర్శి

చండ్రుగొండ, మన భద్రాద్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలంలోనీ సిపిఐ మండల కార్యదర్శి బొర్రా కేశవరావు మాట్లాడుతూ నిన్న జరిగిన అశ్వారావుపేట నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరైన సిపిఐ పార్టీని చిన్న చూపు చూశారని సిపిఐ పార్టీ అని పలకడానికి కూడా ఇష్టపడలేదని, అలా పిలవకపోగా సిపిఐ పార్టీ సంఘీభావం తెలపడానికి వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారని, ఈ కార్యక్రమానికి సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గం స్థాయి అన్ని మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు. కనీసం ఒక్క సిపిఐ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడించకపోవడం , ఇదేనా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు, ఇదే తీరు ఎన్నికల వరకు ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చని, ప్రభుత్వం ఇదే గర్వంతో ప్రవర్తిస్తే ఫలితాలు మారొచ్చని ఆయన అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. తోటి వారిని గౌరవించటం సంస్కారం , సాంప్రదాయమని పెద్దలు చెబుతారు. దాన్ని విస్మరిస్తే ఫలితాలు మారుతాయని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page