Monday, March 23, 2026
HomeTelangana Newsమావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం…?

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం…?

Loading

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం…?

అల్లూరి జిల్లా,మారేడుమిల్లి టైగర్ జోన్ లో ఎన్కౌంటర్..

ఎన్ కౌంటర్ లో ఆరుగురు మృతి,మృతుల్లో అగ్ర నాయకులు

చర్ల, మన భద్రాద్రి న్యూస్, నవంబర్ 18

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల టైగర్ జోన్ లో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పుల మోతతో మారేడుమిల్లి అటవీప్రాంతం దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే దట్టమైన అటవీప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 6-7 గంటల సమయంలో పోలీసులు -మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కాల్పుల నేపథ్యంలో పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page