![]()
- సింగర్ కల్పన కూతురు
నిజాంపేట, మన భద్రాద్రి వెబ్ డెస్క్
సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని వస్తున్న వార్తలపై ఆమె కూతురు తాజాగా స్పందించారు. ప్రస్తుతం కల్పన ట్రీట్మెంట్ పొందున్న నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు.
మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదని, నిద్ర మాత్రల ఓవర్ డోస్ వల్లే అస్వస్థతకు గురయ్యారని, మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, తొందర్లోనే మళ్లీ ఎప్పటిలాగా మీ ముందుకు వస్తారని తెలిపింది. దయచేసి ఎలాంటి ఊహాగానాలు, అసత్యప్రచారం చేయొద్దు’ అని కల్పన కూతురు మీడియాను సవినయంగా వేడుకున్నారు. కాగా, కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.


