![]()
మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేల రూపాయలు ప్రకటించాలి
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
చండ్రుగొండ మండల రైతు సంఘం నాయకులు పెద్దిని వేణు శుక్రవారం ఉదయం మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మిర్చి కల్లాళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ 2017 నుంచి మిర్చి పంటకు తామర, వైరస్ వలన రైతులు తీవ్ర నష్టపోయారని దీని ద్వారా దిగుబడి తక్కువ, ఖర్చు ఎక్కువ పెట్టడం వలన ఎరువులు, పురుగుమందులు వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ ఖర్చులకు మాత్రమే సరిపోయిందని, గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఖర్చులకు మాత్రమే సరిపోతుందని ప్రభుత్వం వెంటనే రాయితీ రూపంలో మిర్చి పంటను కొనుగోలు చేయాలని, మిర్చి మార్క్ఫెడ్ కంపెనీని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లేకపోతే రైతాంగమంతా నష్టపోయే అవకాశం ఉందని వారు అన్నారు. రైతుకు మిర్చి పంటకు మద్దతు ధర కల్పించకపోతే రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఐక్యం చేసి రైతాంగ ఉద్యమాలు చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, రాయి రాజా, చల్లపల్లి రాజా రైతులు దడిగల శ్రీను, ఎలమందల లక్ష్మణ్, బడుగు సురేష్, అంతటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.


