![]()
-వారి ఆధ్వర్యంలోనే సొసైటీ ర్యాంపులకు భారీ యంత్రాలతో, టిప్పర్లతో స్టాక్ పాయింట్ కు ఇసుక డంపింగ్
- మొర పెట్టుకుంటున్న గిరిజన సొసైటీ సభ్యులు, స్థానిక ప్రజలు
-పత్రికలలో ఎన్ని కథనాలు వచ్చినా నిద్రావస్థలో సంబంధిత అధికారులు
-కలెక్టర్ వెంటనే అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సొసైటీ సభ్యుల వేడుకోలు
మంగపేట, మన భద్రాద్రి న్యూస్, మే 19
ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి గిరిజన ఇసుక క్వారీలలో అవినీతి జోరుగా సాగుతుంది. దీనిపై పత్రికలలో ఎన్ని కథనాలు ప్రచురించినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సొసైటీ సభ్యులకు ఉపాధి కల్పించకుండా టీఎస్ఎండీసీ అధికారులు భారీ యంత్రాలను ఉపయోగించి టిప్పర్లతో ఇసుకను యథేచ్ఛగా డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారని గిరిజన సొసైటీ సభ్యులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. చుంచుపల్లి గిరిజన ఇసుక క్వారీలలో ఏం జరుగుతుందో అని విశ్లేషణకు వెళ్లిన ” మన భద్రాద్రి న్యూస్ ” విలేఖరి అక్కడ జరిగే అవినీతిని చూసి నిర్గాంతపోయారు. ఇకనైనా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అవినీతికి పాల్పడుతున్న రైజింగ్ కాంట్రాక్టర్లపై, ముడుపులు పుచ్చుకొని అవినీతి చేస్తున్న టీఎస్ఎండీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సొసైటీ సభ్యులు, మండల ప్రజలు వేడుకుంటున్నారు.


