![]()
మువ్వాను అభినందించిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్ గా నియమితులైన మువ్వా విజయబాబును ఆదివారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అభినందించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఇరిగేషన్ కార్యాలయంలో చైర్మన్ గా ప్రమాణ స్వీకరణ చేసిన అనంతరం మువ్వాను కొత్వాలతోపాటు కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు శాలువా, బొకేలతో సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, జడ్పీటీసీ బరిపటి వాసుదేవరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు తుమ్మల శివారెడ్డి, వై వెంకటేశ్వర్లు, బాలినేని నాగేశ్వరరావు, చింతా నాగరాజు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, భావ్ సింగ్, బాదర్ల జోషి, ధర్మసోత్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


