Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

Loading

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

  • బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసంలో నిర్వహించే  ఉపవాస దీక్షలు దైవ ప్రార్ధనలతో సామరస్యం, ఆనందం వెల్లి విరియాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్యం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు.

దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులంతా నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో పవిత్ర ప్రార్థనలు చేస్తూ ప్రతి ఒక్కరు ఉన్న దానిలో  ఎంతోకంత దానధర్మాలు చేస్తారని అన్నారు. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page